విశ్రాంతి తీసుకునే సమయంలో సేవాకార్యక్రమాలు అభినందనీయం
["సీనియర్ సిటీజన్స్ కార్యాలయంలో అవార్డుల పంపిణీ కార్యక్రమం","వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తలసాని","మరింత ఉత్సాహం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలి","నా వంతు సహాయసహకారాలు అందిస్తాను","ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్"]
సనత్ నగర్,సెప్టెంబర్13 (రాజధాని న్యూస్) : ఎన్ని ఆస్తులు, అంతస్తులు సంపాదించినా మనం చేసిన మంచి మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ లోని బి కె గూడ లోని సీనియర్ సిటీజన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటీజన్స్ నాడు నిర్వహించిన క్యారమ్, చెస్, జనరల్ నాలెడ్జ్ పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అవార్డులు పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వయసును సైతం లెక్క చేయకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సనత్ నగర్ సీనియర్ సిటీజన్స్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. క్రీడలలో సైతం సీనియర్ సిటీజన్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సీనియర్ సిటీజన్స్ లో మరింత ఉత్సాహం పెంపొందించే విధంగా పెద్ద ఎత్తున సీనియర్ సిటీజన్స్ క్రీడా పోటీల నిర్వహించాలని, అందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు.
కామెంట్లు