గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తలసాని
సికింద్రాబాద్,సెప్టెంబర్14(రాజధాని న్యూస్) : వినాయక చవితి సంధర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డులోని గణపతి దేవాలయం లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మోండా డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు గందే నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, సత్యనారాయణ, జయరాజ్, సంతోష్ తదితరులు ఉన్నారు.
కామెంట్లు